లేడీ డాన్ ఫోన్‌లో ఏముంది? ఆ లీడర్ల గుండెల్లో దడ..! ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయ్?
ఆమె ఫోన్‌లోని వివరాలు బయటికొస్తే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న చర్చ అటు టీడీపీలో..ఇటు వైసీపీలో ఉందంటున్నారు.

Lady Don Aruna
Lady Don Aruna: మర్డర్ అయినా..సెటిల్‌మెంట్ అయినా..పనేదైనా మేడమ్ వన్స్ స్టెపిన్ పని అయిపోవాల్సిందే. పోలీసు ఆఫీసర్లనే ఒక ఆటాడించి, IAS అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని, పొలిటికల్ లీడర్ల అండతో చెలరేగిపోయిన లేడీడాన్ అరుణ ఎపిసోడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ లవర్..లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయట.
అరుణ ఫోన్ డేటా ఆధారంగా ఆమె చేసిన సెటిల్‌మెంట్లు, రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలపై సెన్సేషనల్ లీకులు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ డేటా, ఫోన్ కాల్ వివరాలు బయటికి వచ్చాయన్న ప్రచారంతో..గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన లీడర్లు, పోలీస్ ఆఫీసర్లలో గుండెల్లో దడ మొదలైందట.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత.. ఎందుకంటే?
రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్నవారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించారని పెద్ద ఎత్తున దుమారం నడిచింది. టీడీపీ ఎమ్మెల్యేలే పెరోల్ కోసం లేఖలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. లేఖ ఇచ్చింది వాస్తవమే హోంశాఖ తన లెటర్ యాక్సెప్ట్ చేయలేదంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఆ ఇష్యూపై మొన్నటివరకు వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్స్ వార్, డైలాగ్ వార్ నడిచింది.
అలా చిన్న గ్యాప్ వచ్చిందో లేదో..ఇప్పుడు అరుణ మొబైల్ ఫోన్‌లో సంచలన విషయాలు అంటూ రచ్చ నడుస్తోంది. గతంలో సూళ్లూరుపేటలో ఓ వ్యక్తి తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్‌కి సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా అనుమానిస్తున్నారట పోలీసులు. సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు సెటిల్‌మెంట్లు చేసినట్లు ప్రచారం భావిస్తున్నారట. ఓ మాజీ ఎమ్మెల్యేతో అరుణ సన్నిహితంగా మెలిగినట్లు ఆమె ఫోన్‌లో ఉన్న వీడియోల ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. అరుణ ఫోన్ డేటా ఆధారంగా పాత నేరాల చిట్టా బయటపడుతోందట.
అరుణ ఫోన్‌లో ఏముంది?
ఇంతకు అరుణ ఫోన్‌లో ఏముంది? ఇది నెల్లూరు ప్రజలకే కాదు..ఏపీ పబ్లిక్‌కు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అరుణ ఎపిసోడ్‌లో ఎవరు ఇరుక్కుంటున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. అరుణ గతంలో వైసీపీ నేతలతో సంబంధాలు మెయింటెన్ చేస్తే..కూటమి పవర్‌లోకి వచ్చాక టీడీపీ లీడర్లతో దోస్తీ చేస్తోందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అరుణ ఫోన్‌లో ఎవరెవరి రహస్యాలు ఉన్నాయి.? ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయి.?
ఇదే ఇప్పుడు అరుణకు సన్నిహితంగా ఉండే అధికారులు, రాజకీయ నేతలు, పోలీస్ ఆఫీసర్లలో ఆందోళనకు దారితీస్తోంది. లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియోలు వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
కోర్టు అనుమతి తీసుకుని..అరుణ సమక్షంలోనే ఆమె ఫోన్‌లో ఉండే సమాచారాన్ని తీసుకోవాలనుకుంటున్నారట. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు అరుణ దగ్గర నుంచి రెండు ఫోన్‌లు, రెండు సిమ్‌లను సీజ్ చేశారట. అధికారులు..రాజకీయ నేతలతో మాట్లాడే ఫోన్ కన్వర్జేషన్స్‌ను రికార్డు చేసే అలవాటు ఆమెకు ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
ఆమె కాల్ లిస్ట్‌పై పోలీసులు దృష్టి
లేడీ డాన్ బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తుందటంతో ఆమె కాల్ లిస్ట్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఆమె ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉంది.? ఎవరితో చాట్ చేసిందనే ఇన్ఫోను బయటికి తీసే ప్రయత్నం చేస్తోందట పోలీస్‌శాఖ. రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారట.
ఇలా ఎన్నో రకాలు లీకులు, ప్రచారాలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అరుణ ఫోన్‌లో డేటాను తీసుకునేందుకు పోలీసులు లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారట. (Lady Don Aruna)
ఆమె ఫోన్‌లోని వివరాలు బయటికొస్తే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న చర్చ అటు టీడీపీలో..ఇటు వైసీపీలో ఉందంటున్నారు. సేమ్‌టైమ్ ఏ ఒక్క పార్టీ లీడర్‌తో మాత్రమే ఆమెకు సంబంధాలు లేవని..అందరితో సన్నిహితంగా ఉంటూ అరుణ సెటిల్‌మెంట్లు, దందాలు చేసేదని నెల్లూరులో చర్చ జరుగుతోంది. ఈ కేసు కూడా అటుఇటు తిరిగి పలువురు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్న టాక్ అయితే వినిపిస్తోంది.