Nithiin 32 : నితిన్-వక్కంతం వంశీ సినిమా క్రేజీ అప్డేట్.. ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్ నటించిన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 22, 2023 / 03:47 PM IST
Nithiin 32
Nithiin 32 First look : యంగ్ హీరో నితిన్ నటించిన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. Nithiin32 అనే వర్కింగ్ టైటిల్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ను జూలై 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. భుజాన బ్యాగ్ వేసుకుని నితిన్ వెలుతున్న.. వెనుక వైపు నుంచి ఉన్న చిత్రం అది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నితిన్ స్వంత సంస్థ శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తోంది. హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎగస్ట్రా అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఆర్డీనరీ మ్యాన్ అనేది ఉప శీర్షిక గా తెలుస్తోంది. ఈ సినిమా సరికొత్తగా ఉంటుందని టాక్.
కాగా.. ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ తర్వాత దర్శకుడిగా వక్కంతం వంశీకి, ‘మాచర్ల నియోజకవర్గం’ తరువాత నితిన్ కి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఎలాగైన సరే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని వీరిద్దరు చాలా కసిగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నితిన్ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి ఆయన నటించనున్నారు. ‘భీష్మ’ తరువాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మొదట ఈ సినిమాలో రష్మిక మందన్న ను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే.. ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని ఆమె స్థానంలో శ్రీ లీల ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది.
