35 Chinna katha kaadu movie streaming in Aha
35 Chinna katha kaadu : నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’. రానా సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణంలో నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సెప్టెంబర్ 6న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
ఇక అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆహా టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది. చదువు రాక ఇబ్బంది పడే పిల్లల మానసిక పరిస్థితి గురించి, ఆ సమయంలో కుటుంబంలో ఉండే సంఘర్షణ వంటి అంశాలు ఉండడంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
Devara : బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. వారం రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?