బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే!

బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే!

Updated On : August 31, 2019 / 1:20 PM IST

బిగ్ బాస్ 3 సీజన్ హోస్ట్‌గా నాగార్జున తనదైన స్టైల్‌లో అభిమానులను కట్టిపారేస్తున్నారు. వారానికోసారి కనిపించినా బిగ్ బాస్ ఇంటి సభ్యుల మాటల్లో రోజూ నాగ్ సార్.. నాగార్జున గారు అంటూ వినిపిస్తూనే ఉన్నారు. వీకెండ్ రోజుల్లో ఇంటి సభ్యులతో గేమ్‌లు వాటి మధ్యలో సేవ్ చేస్తూ చివరిగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ పేరు చెప్పే నాగార్జున.. ఈ వారం షోలో కనిపించరని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, నాగ్‌కు బదులు హోస్ట్‌గా రమ్యకృష్ణ రానున్నట్లు స్టార్ మా ఛానెల్ ఇప్పటికే ప్రోమోలో ఖరారు చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. హోస్ట్‌గా వచ్చిన రమ్యకృష్ణ ఎలిమినేషన్ క్యాండిట్‌‌ను ప్రకటిస్తుందా.. అయితే ఎలిమినేట్ అయ్యేది ఎవరని ప్రేక్షకులంతా ఈ వారం ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు. 

రమ్యకృష్ణ ఈ వారం హోస్ట్‌గా మాత్రమే వస్తున్నారట. డిటైల్డ్ అనాలసిస్‌తో హౌజ్‌లో నుంచి బయటకు వెళ్లబోయే క్యాండిట్‌ను ప్రకటించడానికి రావడం లేదట. కేవలం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో షోను నడిపేందుకు మాత్రమే వస్తున్నారని సమాచారం. 

ఈ వారం నామినేట్ అయిన ఆరుగురిలో ఇప్పటికే ముగ్గుర్ని సేవ్ చేసేశాడు బిగ్‌బాస్. దీంతో కేవలం ముగ్గురే నామినేషన్ బరిలో నిలిచారు. రమ్యకృష్ణ చేతుల మీదుగా ఆ ముగ్గుర్ని కూడా సేవ్ చేసేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ సీజన్లో ఎలిమినేషన్ లేకుండా సాగే వారం ఇదే. 60వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నాగార్జున విదేశాల్లో ఉన్నారు.