కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా సంక్షోభంతో అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు చాలామంది నష్టపోయారు.
ఇలా మరెన్నో పెను మార్పులు సంభవించాయి. కరోనా తర్వాత కూడా తాత్కాలికంగా సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనాకు ముందు మాదిరిగా బహిరంగ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు వంటి నిర్వహించడానికి వీలుండదు. గతంలో పరిస్థితులు మాదిరిగా ఫిల్మ్ మార్కెటింగ్ పరిస్థితి ఉండబోదని ప్రముఖ నిర్మాత శోభూ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
కరోనా తర్వాత ఫిల్మ్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుందని ఆశ్చర్యపోతున్నానని అన్నారు. ప్రీ రీలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, థియేటర్స్, మాల్స్ కు వెళ్లడం, సినిమా ప్రమోషన్స్ కోసం రోడ్ ట్రిప్స్ కు వెళ్లడం ఇకపై ఉండవుని అన్నారు. ఇకపై అంతా డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ చిట్ చాట్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయని శోభూ తెలిపారు.
Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, వీడియో వచ్చేస్తోంది