‘నూటొక్క జిల్లాల అందగాడు’ ప్రారంభం

శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ (చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో, హీరోయిన్లుగా.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : October 19, 2019 / 09:41 AM IST
‘నూటొక్క జిల్లాల అందగాడు’ ప్రారంభం

Updated On : October 19, 2019 / 9:41 AM IST

శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ (చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో, హీరోయిన్లుగా.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

‘నూటొక్క జిల్లాల అందగాణ్ణి’ అంటూ నూతన్ ప్రసాద్ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆ టైటిల్‌తో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అనే సినిమా రూపొందుతుంది. మంచి  సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో వ‌స్తే నిర్మాత‌గా త‌న వంతు స‌హకారం అందించడంతో పాటు నిర్మాణంలో భాగ‌స్వామిన‌వడానికీ తాను సిద్ధ‌మ‌ని దిల్‌రాజు ఇటీవ‌ల తెలిపారు. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా తొలి అడుగు ప‌డింది.

దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ అనే సినిమా రూపొంద‌నుంది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, శిరీష్‌తో పాటు ‘గ‌మ్యం’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి’, వంటి సినిమాల‌ను నిర్మించిన ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు..

Read Also : తెలుగు పాటల్లో ‘సామజనవరగమన’ సరికొత్త రికార్డ్

వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్కనుంది. శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ (చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ,  స్వీకార్ అగ‌స్తి సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.