Sonu Sood : సోనూసూద్‌పై నార్తర్న్ రైల్వే ఆగ్రహం..
బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్న తరుణంలో.. 'తన పాత నెంబర్ ఇంకా వర్కింగ్ లోనే ఉంది. సహాయం కావాల్సి వస్తే చింతించకండి సంప్రదించండి' అంటూ తన ఉదారతను చాటుకున్నాడు. అయితే ఇంతటి మంచి మనిషిపై నార్తర్న్ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది.
- gum 95921
- Published On : January 5, 2023 / 01:00 PM IST
Northern Railway angry with Sonu sood
Sonu Sood : బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. రీల్ లైఫ్‌లో విలన్‌గా అందర్నీ భయపెట్టిన ఈ నటుడు రియల్ లైఫ్‌లో మాత్రం కష్టంలో ఉన్నవారికి అభయమిస్తూ దేవుడిలా నిలుస్తున్నాడు. కరోనా సమయంలో ఇతర నగరంలో చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ప్రత్యేక బస్సులు వేయించి సొంత ఊళ్ళకి పంపించాడు. ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్న తరుణంలో.. ‘తన పాత నెంబర్ ఇంకా వర్కింగ్ లోనే ఉంది. సహాయం కావాల్సి వస్తే చింతించకండి సంప్రదించండి’ అంటూ తన ఉదారతను చాటుకున్నాడు.
Sonu Sood : కరోనాతో జాగ్రత.. నా పాత నెంబర్ పని చేస్తుంది.. సోనూ సూద్!
అయితే ఇంతటి మంచి మనిషిపై నార్తర్న్ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల సోనూసూద్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఫుట్‌బోర్డు దగ్గర కూర్చొని బయటకి చూస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యి నార్తర్న్ రైల్వే వరకు చేరుకుంది. ఇక ఆ వీడియో చూసిన నార్తర్న్ రైల్వే.. తమ ట్విట్టర్ ఖాతా ద్వారా సోనూసూద్ ని హెచ్చరించింది.
‘డియర్ సోనూసూద్ మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమందికి రోల్ మోడల్. అలాంటి మీరు ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఈ విధంగా చేస్తుంటే.. ఎంతోమంది దానిని అనుసరించే ప్రమాదం ఉంది. కాబట్టి మరోసారి ఇలా చేయకండి ప్లీజ్. సాఫీగా సేఫ్ జర్నీని ఆనందించండి’ అంటూ ట్వీట్ చేసింది. ఈ విషయమై ముంబై రైల్వే పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా స్పందించింది. ఇటువంటివి మరోసారి చేయోదంటూ సోనూసూద్‌ని కోరుతూ ట్వీట్ చేసింది.
प्रिय, @SonuSood
देश और दुनिया के लाखों लोगों के लिए आप एक आदर्श हैं। ट्रेन के पायदान पर बैठकर यात्रा करना खतरनाक है, इस प्रकार की वीडियो से आपके प्रशंसकों को गलत संदेश जा सकता है।
कृपया ऐसा न करें! सुगम एवं सुरक्षित यात्रा का आनंद उठाएं। https://t.co/lSMGdyJcMO
— Northern Railway (@RailwayNorthern) January 4, 2023
