NTR – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. దేవర కోసం పవన్..

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా దేవరకు టికెట్ రేట్లు పెంచి, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.

NTR and Kalyan Ram Special Thanks to Pawan Kalyan for Supporting Devara

NTR – Pawan Kalyan : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమా కావడంతో ఎక్స్ ట్రా షోలు, టికెట్ పెంపు ఉంటాయని ముందునుంచి అందరూ భావించారు. తాజాగా దేవర మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వంను టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోల కోసం సంప్రదించడంతో దేవర సినిమాకు సపోర్ట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేసింది.

ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకు మొదటి రోజు ఏడు షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు అయిదు షోలు పర్మిషన్ ఇచ్చారు. అలాగే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ కి 110 రూపాయలు, లోయర్ క్లాస్ కి 60 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు 135 రూపాయల వరకు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రికు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Also Read : Devara – Pawan Kalyan : అడిగిన వెంటనే ఎన్టీఆర్ ‘దేవర’ టికెట్ రేట్ల పెంపు, ఎక్స్‌ట్రా షోలు.. డిప్యూటీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన నిర్మాత..

ఈ క్రమంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా దేవరకు టికెట్ రేట్లు పెంచి, ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. దేవర రిలీజ్ కోసం కొత్త జీవో పాస్ చేసినందుకు, మాకు సపోర్ట్ గా నిలిచినందుకు, తెలుగు సినిమాకు మీరు ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేశ్ గారికి కూడా కృతజ్ఞతలు అని తెలిపారు.

ఇక కళ్యాణ్ రామ్ తన ట్వీట్ లో.. మా దేవర సినిమాకు కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు. ఇలా హీరోలు, నిర్మాతలు దేవరకు సపోర్ట్ చేస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్స్ చేస్తుండటంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.