వర్మ లక్ష్మీస్ : ఎన్టీఆర్ – పరిటాల రవి సెల్ఫీ టైం
వైరల్ అవుతున్న ఎన్టీఆర్-పరిటాల రవి సెల్ఫీ

వైరల్ అవుతున్న ఎన్టీఆర్-పరిటాల రవి సెల్ఫీ
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ.. లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ.. ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే కోటి వ్యూస్ దాటేసి దూసుకుపోతుంది. లక్ష్మీ’S ఎన్టీఆర్.. కుటంబ కుట్రల చిత్రం అంటూ, లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించ బోతున్నానని, నిజాలు నిర్భయంగా చెప్పబోతున్నానని, వెన్నుపోటు అంశం హైలెట్ అవుతుందని వర్మ ముందునుండీ చెప్పడంతో, సినిమాకి మంచి హైప్ వచ్చింది. రీసెంట్‌గా లక్ష్మీ’S ఎన్టీఆర్ సెట్‌లో నుండి బయటకొచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ క్యారెక్టర్ చేస్తున్న నటుడితో, పరిటాల రవి క్యారెక్టర్ చేస్తున్న నటుడు సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్టీఆర్ చేతులు కట్టుకుని నిలబడి, కెమెరా వంక చూస్తుండగా, పరిటాల రవి సెల్ఫీ తీసాడు. ఈ పిక్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్ చల్ చేస్తుంది. మార్చిలో లక్ష్మీ’S ఎన్టీఆర్ రిలీజ్ కానుంది.
వాచ్ ట్రైలర్…