NTR Anil Ravipudi : ఇదెక్కడి ట్విస్ట్.. అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. తారక్ ట్వీట్ వైరల్..

ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. (NTR Anil Ravipudi)

  • Updated on- November 14, 2026 / 05:11 PM IST

NTR Anil Ravipudi

NTR Anil Ravipudi : టాలీవుడ్ లో వరుస హిట్స్ కొట్టే దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రతి పండక్కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకొచ్చి అభిమానులను నవ్వించి హిట్ కొట్టేస్తున్నాడు అనిల్. దీంతో అనిల్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో జనవరి 12 విడుదల సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు.

తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు తారక్. అయితే దేవర తో మిక్స్‌డ్ టాక్, వార్ సినిమాతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ కానుంది.

Also Read : Giri Babu : గిరిబాబు కన్నుమూత.. ఆయన ఇద్దరు కొడుకుల గురించి తెలుసా? స్టార్ కమెడియన్, హీరో..

ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో సినిమా ప్రకటిస్తూ అనిల్ రావిపూడితో దిగిన ఫోటోని షేర్ చేసి ట్విట్టర్లో.. ఇది కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది అని పోస్ట్ చేసారు. అలాగే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తారు అని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ కాంబోకి షాక్ అవుతున్నారు. సీరియస్ సినిమాలు తీస్తూ పాన్ ఇండియా అంటూ వెళ్లిన ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే నిన్నే దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ లో 2028 సంక్రాంతికి అనిల్ రావిపూడితో మా సినిమా ఉంటుంది అని ప్రకటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ప్రకటించారు. మరోపక్క ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరి కాంబో 2029 లో ఉండొచ్చు అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తున్నాం అని దిల్ రాజు ప్రకటించడంతో 2028 లో పవన్ కళ్యాణ్ – అనిల్ రావిపూడి సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అనిల్ రావిపూడి వరుసగా స్టార్ హీరోలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫ్యాన్స్ షాక్ అయినా హిట్ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.