బాహుబలి తర్వాత, డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడయిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్
భారీ అంచనాల మధ్య, మరికొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఎన్టీఆర్ కథానాయకుడు. విబ్రి మీడియా, సాయి కొర్రపాటి సహ నిర్మాతలు కాగా, బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరా దేవి నిర్మాతలు. క్రిష్ డైరెక్ట్ చేసిన కథానాయకుడు డిజిటైల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు పార్ట్‌లకుగానూ అమోజాన్ ప్రైమ్, దాదాపు రూ.25కోట్లు ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి.
ఈ సినిమా అన్ని భాషల డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో ఏకంగా, రూ.60కోట్లు వసూలు చెయ్యడం విశేషం. (రెండు పార్ట్‌లు) ఇక థియేట్రికల్ బిజినెస్ అదనం. ఈ లెక్కన నిర్మాతలకు పెట్టుబడి మొత్తం ముందే వచ్చేసింది. బాహుబలి తర్వాత, డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీగా అమ్ముడయిన సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాల వారి మాట. తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ భాషల్లోనూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కాబోతున్నాయి. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది.
వాచ్ ట్రైలర్…