Mad Movie : బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ఓటీటీకి వచ్చేస్తుంది..

బాక్సాఫీస్ వద్ద ఫన్ రోలర్ కోస్టర్‌గా కడుపుబ్బా నవ్వించిన ఎన్టీఆర్ బామ్మర్ది 'మ్యాడ్' మూవీ.. ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకుంది.

NTR cousin Narne Nithin sangeeth shobhan Mad Movie OTT release update

Mad Movie : ఈ ఏడాది చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సత్తా చాటాయి. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పెద్ద సినిమాలు కంటే.. ఏ అంచనాలు లేకుండా వచ్చి బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిన్న సినిమాల లిస్టే ఎక్కువ ఉంది. ఇక లిస్టులో ‘మ్యాడ్’ మూవీ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. థియేటర్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక చాలా కాలం తరువాత కాలేజీ స్టూడెంట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కడంతో కాలేజీ స్టూడెంట్స్ అంతా మూవీ పై మంచి ఆసక్తి చూపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ నిర్మించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది.

Also read : Fake Flashback Movies : ఫేక్ ఫ్లాష్‌బ్యాక్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలివే..

నవంబర్ 3 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మరి థియేటర్ లో ఎవరైన ఈ ఫన్ రోలర్ కోస్టర్ ని మిస్ అయ్యుంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. కాలేజీలో ముగ్గురు స్టూడెంట్స్, సీనియర్స్ గొడవలు, చదువులు.. అన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. గతంలో వచ్చిన కాలేజీ బేస్డ్ సినిమాల్లో ఎమోషన్స్, మెసేజ్ లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం కేవలం కామెడీ మాత్రమే ఉంటుంది.