Devara 2 : దేవర 2 ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పండయ్యా.. పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి..

ఇటీవల సెప్టెంబర్‌ 27కి దేవర సినిమా రెండేళ్లు కంప్లీట్‌ చేసుకోవడంతో తెలుగు స్టేట్స్‌లో స్పెషల్‌ షోలతో సెలబ్రేట్‌ చేసుకున్నారు తారక్‌ అభిమానులు. (Devara 2)

  • Published on- September 29, 2026 / 08:59 AM IST

Devara 2

Devara 2 : మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర సినిమా ఫ్యాన్స్ ని మెప్పించింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన తర్వాత 500 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్స్ వేయడం, కొంతమంది నిర్మాతలు కలెక్షన్స్ పోస్టర్స్ ఫేక్ అని చెప్పడంతో దేవర కలెక్షన్స్ పై పెద్ద చర్చే జరిగింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ అవసరం లేకపోయినా బలవంతంగా ఓ లీడ్ ఇచ్చి సీక్వెల్ ప్రకటించారని అంతా అభిప్రాయపడ్డారు.

ఇటీవల సెప్టెంబర్‌ 27కి దేవర సినిమా రెండేళ్లు కంప్లీట్‌ చేసుకోవడంతో తెలుగు స్టేట్స్‌లో స్పెషల్‌ షోలతో సెలబ్రేట్‌ చేసుకున్నారు తారక్‌ అభిమానులు. కానీ మేకర్స్‌ నుంచి దేవర సీక్వెల్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మళ్లీ బిగ్‌ డైలమా క్రియేట్‌ అవుతుంది. రెండు భాగాలుగా డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని ప్లాన్‌ చేశారు. అయితే దేవర2 కచ్చితంగా ఉంటుందని మేకర్స్‌ చెప్తున్నా అదేమంత ఈజీ కాదనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

Also Read : Allari Naresh Daughter : కూతురు 10వ పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అల్లరి నరేష్..

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్‌ సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌ తెరకెక్కించే మైథలాజికల్‌ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అవుతారని లైనప్‌ పరంగా ఓ క్లారిటీ ఉంది. దీంతో కొరటాల శివతో దేవర 2 పట్టాలెక్కించాలంటే మాత్రం 2027 ఎండింగ్‌ అయినా క్లారిటీ వస్తుందా అనేది సస్పెన్సే అంటున్నారు. ఇక దేవర 2 సినిమాని పట్టాలెక్కించాల్సిన డైరెక్టర్‌ కొరటాల శివ అబ్బాయ్‌ ఎన్టీఆర్‌కి బ్రేక్‌ ఇచ్చి.. బాబాయ్‌ బాలకృష్ణతో సినిమాని ప్రకటించారు. NBK112 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా అఫీషియల్‌గా పట్టాలెక్కింది. దాదా సినిమాని పూర్తి చేశాక కొరటాల శివ సినిమాతో జాయిన్‌ అవుతారు బాలయ్య.

బాలయ్య-కొరటాల శివ సినిమా షూటింగ్‌ 2027 సంక్రాంతికి మొదలెట్టే చాన్స్‌ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక దేవర 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు కూడా టాలీవుడ్ లో టాక్ కూడా వినిపించట్లేదు. ఆ మధ్యలో దేవర 2 రిస్క్ అవసరమా అని కూడా కామెంట్స్ వినిపించాయి. దీంతో ఫైనల్‌గా దేవర2 ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అది తెలియాలంటే కొరటాల శివ – బాలయ్య సినిమా అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే. అంటే కనీసం 2028 సంక్రాంతి వరకు అయినా వెయిట్ చేయాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Also Read : Bigg Boss Telugu 10 : కుక్కలు అరిచినట్టు కంటెస్టెంట్స్ అరుపులు.. షాలిని ఓవర్ యాక్షన్.. చిచ్చు పెట్టిన అపూర్వ.. బిగ్‌ బాస్ 10 డే 22 ఎపిసోడ్‌..