Devara Update : ‘దేవర’ షూటింగ్ అప్డేట్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉందంటే..?
దేవర సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజయింది.
- Saketh U
- Published On : July 10, 2024 / 07:50 AM IST
NTR Devara Movie Shooting Update and Interesting news about Songs
Devara Update : ఎన్టీఆర్ నుంచి RRR తర్వాత అనౌన్స్ చేసిన ‘దేవర’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రానున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో దేవర సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర సినిమా ఇంకా షూటింగ్ జరుగుతనే ఉంది.
ఇటీవల థాయిలాండ్ కి వెళ్లి ఎన్టీఆర్, జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి కేవలం ఒక వారం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, అలాగే రెండు పాటలు షూటింగ్ మిగిలి ఉందని తాజా సమాచారం. ఇంకో వారం రోజులు షూట్ చేస్తే దేవర టాకీ పార్ట్ షూటింగ్ అయిపోతుందని తెలుస్తుంది. త్వరగా ఆ షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారు. ఆల్రెడీ షూట్ పూర్తయినంతవరకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టారు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాంగ్ మాత్రమే రిలీజయింది. అయితే ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని తెలుస్తుంది. దేవర టైటిల్ సాంగ్ తో పాటు ఎన్టీఆర్, జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పటివరకు చిత్రీకరించారు. త్వరలోనే ఇంకో రెండు పాటలు షూట్ చేయనున్నారు.
