Kalyan Ram – Chiranjeevi : బింబిసార – విశ్వంభర సినిమాటిక్ యూనివర్స్..? కళ్యాణ్ రామ్ – చిరంజీవితో వశిష్ఠ ప్లాన్ చేస్తున్నాడా?

డైరెక్టర్ వశిష్ఠ తాజాగా తన ట్విట్టర్ బ్యానర్ విశ్వంభర, బింబిసార సినిమాల పేర్లు వచ్చేలా ఒక కొత్త డిజైన్ చేసి పెట్టుకున్నాడు.

Kalyan Ram – Chiranjeevi : బింబిసార – విశ్వంభర సినిమాటిక్ యూనివర్స్..? కళ్యాణ్ రామ్ – చిరంజీవితో వశిష్ఠ ప్లాన్ చేస్తున్నాడా?

Director Vassishta Plans Bimbisara Vishwambhara Kalyan Ram Chiranjeevi Cinematic Universe Rumours Goes Viral

Updated On : July 10, 2024 / 6:38 AM IST

Kalyan Ram – Chiranjeevi : ఇటీవల సినిమాటిక్ యూనివర్స్ లు మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి. ఈ సినిమాటిక్ యూనివర్స్ ల ప్రకటనతో రాబోయే సినిమాలపై మంచి అంచనాలు ఉంటున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఉండగా తాజాగా ఇంకో సినిమాటిక్ యూనివర్స్ పేరు వినిపిస్తుంది.

బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని కలుపుతూ కొత్త సినిమాటిక్ యూనివర్స్ వస్తుందా అని సోషల్ మీడియాలో చర్చగా మారయింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కేవలం అభిమానులు, నెటిజన్లు మాత్రమే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ వశిష్ఠ తాజాగా తన ట్విట్టర్ బ్యానర్ విశ్వంభర, బింబిసార సినిమాల పేర్లు వచ్చేలా ఒక కొత్త డిజైన్ చేసి పెట్టుకున్నాడు.

Also Read : Urvashi Rautela : ‘NBK 109’ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతేలా..!

సాధారణంగా సెలబ్రిటీలు తాము వర్క్ చేసే సినిమాలు లేదా ఆల్రెడీ చేసిన సినిమాల పోస్టర్స్, టైటిల్స్ ఇలా ట్విట్టర్ బ్యానర్ లో పెట్టుకుంటారు. అయితే వశిష్ఠ ఈ రెండు టైటిల్స్ కలిసి ఒకే ప్రపంచంలో ఉన్నట్టు బ్యాక్ గ్రౌండ్ డిజైన్ చేయించి మరీ పెట్టాడు. ఆ బ్యానర్ చూస్తే ఆ రెండు సినిమాలకు లింక్ ఉందనే అనిపిస్తుంది ఎవరికైనా. ఇంకేముంది కళ్యాణ్ రామ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు డైరెక్టర్ వశిష్ఠ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడు, బింబిసార, విశ్వంభర, ఆ తర్వాత రాబోయే సినిమాలతో లింక్ ఇస్తూ ఒక సినిమాటిక్ యూనివర్స్ చేస్తారు అని పోస్టులు చేస్తున్నారు.

Director Vassishta Plans Bimbisara Vishwambhara Kalyan Ram Chiranjeevi Cinematic Universe Rumours Goes Viral

ఇటీవలే బింబిసార సినిమాకు ప్రీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్ కేవలం ఊహాగానాలే అయినా జరిగితే బాగుండు, కథాపరంగా జరిగే ఛాన్సులు ఉండొచ్చు, మెగా – నందమూరి అభిమానులు మరోసారి కలిసి సినిమాని ఎంజాయ్ చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ వశిష్ఠ దీనిపై ఏమంటాడో చూడాలి.