Urvashi Rautela : ‘NBK 109’ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతేలా..!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సి ప‌ని లేదు.

Urvashi Rautela : ‘NBK 109’ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ న‌టి ఊర్వశి రౌతేలా..!

Urvashi Rautela injured on NBK 109 set Hospitalized

Updated On : July 9, 2024 / 9:12 PM IST

Urvashi Rautela – NBK 109 :  తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన‌ ప‌ని లేదు. ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’, ‘ఏజెంట్’, ‘స్కంద’ మూవీల్లో స్పెష‌ల్ సాంగ్స్‌తో యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది అమ్మ‌డు. ప్ర‌స్తుతం ఆమె నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న NBK109 చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

కాగా.. షూటింగ్‌లో ఊర్వశి గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ప్రాక్చ‌ర్ అయింద‌ని, తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆమె టీమ్ చెప్పింది. NBK109 మూడో షెడ్యూల్ కోసం ఇటీవ‌లే ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. కాగా.. ఆమె గాయంపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

CM Revanth Reddy : రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. భార‌తీయుడు-2తో మార్పు మొదలు..

ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలాతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చాందిని చౌదరీ ముఖ్య పాత్ర‌ను పోషిస్తోంది. ఇటీవ‌ల బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా ఫ్యాన్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.