Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. రొమాంటిక్ సాంగ్‌కు డేట్ ఫిక్స్‌..

ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవర. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌.

DevaraSecondSingle

ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవర. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌. సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.

ఆగ‌స్టు 5 తేదీన ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌గా ద్వారా వెల్ల‌డించింది. ఇది ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది.

Nenu Meeku Telusa Director : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ‘నేను మీకు తెలుసా’ ద‌ర్శ‌కుడు మృతి.. మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌..

ఇక దేవరలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి ఇటీవ‌ల త‌న ట్విట్టర్ లో.. ‘తంగం అంతరంగం.. హాయిగా.. ఉయ్యాలూగుతున్నట్టుంది..’ అనే లిరిక్స్ రాసి ఇప్పుడే విన్నాను. త్వరలోనే వచ్చేస్తుందిలే అని పోస్ట్ చేసారు. సో రెండో పాట రిలిక్స్ ఇవేనంటూ అంటున్నారు. ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తునారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

VD 12 : విజ‌య్‌దేవ‌ర‌కొండ‌-గౌత‌మ్ తిన్ననూరి మూవీ నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

ట్రెండింగ్ వార్తలు