Nenu Meeku Telusa Director : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ‘నేను మీకు తెలుసా’ ద‌ర్శ‌కుడు మృతి.. మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌..

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ద‌ర్శ‌కుడు అజ‌య్ శాస్త్రి క‌న్నుమూశారు.

Nenu Meeku Telusa Director : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ‘నేను మీకు తెలుసా’ ద‌ర్శ‌కుడు మృతి.. మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌..

Nenu Meeku Telusa Director Ajay Sastry Passed away

Updated On : August 2, 2024 / 3:10 PM IST

Nenu Meeku Telusa Director Ajay Sastry : టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ద‌ర్శ‌కుడు అజ‌య్ శాస్త్రి క‌న్నుమూశారు. మంచు మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కిన ‘నేను మీకు తెలుసా’ చిత్రానికి అజ‌య్ శాస్త్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అజ‌య్ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఇక ఆయ‌న మ‌ర‌ణం త‌న‌ను ఎంతో బాధించింద‌ని మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఆయ‌న‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

నా ప్రాణ స్నేహితుడు, నేను మీకు తెలుసా ద‌ర్శ‌కుడు అజ‌య్ శాస్త్రి ఇక లేరనే వార్త ఎంతో క‌లిచి వేస్తుంద‌ని మంచు మ‌నోజ్ చెప్పారు. మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనంత బాధ‌గా ఉంద‌న్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, ఆత్మీయుల‌కు ధైర్యాన్ని ఇవ్వాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌న్నారు. చాలా త్వ‌ర‌గా వెళ్లిపోయావ్ అజ‌య్‌.. నిన్ను ఎప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది క‌ల అయితే బాగుండు. ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశాడు.

Tiragabadara Saami : ‘తిరగబడర సామీ’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్‌ సినిమా ఎలా ఉందంటే..

ద‌ర్శ‌కుడు కృష్ణవంశీ తీసిన ‘రాఖీ’, ‘డేంజర్’ చిత్రాలకు అజయ్ శాస్త్రి రైటర్‌గా పనిచేశారు. 2008లో ‘నేను మీకు తెలుసా?’ మూవీతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఇది.