Ntr Dupe Anil: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూప్..రాజమౌళినే వెయిట్ చేయించాడు.. ఇతని గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అనిల్(Ntr Dupe Anil).
- V Santhosh Kumar
- Published On : February 14, 2026 / 07:03 AM IST
ntr dupe anil interesting comments about rrr movie
Ntr Dupe Anil: సినిమాల్లో హీరోలకు డూపులను వాడటం చాలా సాధారణంగా మారిపోయింది. ఇది ఇప్పుడు మొదలైన సంప్రదాయం కాదు. చాలా ఏళ్ళ నుంచి ఉన్నదే. ఏదైనా రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు హీరోలకి బదులుగా ఈ డూపులను పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. హీరోలకు ఏదైనా ప్రమాదం జరిగితే షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి, అలాంటి సీన్స్ కోసం డూపులను వాడుతూ ఉంటారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు డూప్స్ ఉన్నారు. అలానే ఎన్టీఆర్ కి కూడా ఉన్నారు. ఆయనే అనిల్(Ntr Dupe Anil). ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో ఇతను డూప్ గా నటించాడు. ఓపక్క IT ఉద్యోగం చేస్తూనే సినిమాల పట్ల ఉన్న ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. ముందుగా జూనియర్ ఆర్టిస్ట్ గా మెదలైన అనిల్ ప్రయాణం ఇప్పుడు ఎన్టీఆర్ కి డూప్ గా చేసేవరకు వచ్చింది. తాజాగా అనిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.
Deepthi Sunaina: పెట్ డాగ్ తో దీప్తి సునైనా.. క్యూట్ ఫొటోలు వైరల్
నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఓపక్క IT జాబ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో నటిస్తున్నాను. అలా నాకు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ అవకాశం వచ్చింది. ఆచార్య వల్ల రాజమౌళి టీం నాకోసం ఏకంగా నెల రోజులు వెయిట్ చేశారు. అలా ఎన్టీఆర్ కి సంబందించిన చాలా సన్నివేశాలు నేను డూప్ గా చేశాను. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ లో, కొమురం భీముడో సాంగ్, కొన్ని బ్యాక్ షాట్స్ నేనే చేశాను. అదే సినిమాలో రామ్ చరణ్ బ్యాక్ షాట్స్ కి కూడా నేను డూప్ గా చేశాను.
సెట్స్ లో రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటారు. ఎన్టీఆర్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రతీ ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు. ఇక రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక చిన్న సన్నివేశమైనా ఆయన అనుకున్నది వచ్చే వరకు నిద్రపోడు. అంతలా కష్టపడతారు ఆయన” అంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక అనిల్ కేవలం డూప్ గానే కాదు నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. ఆలాగే ఎన్టీఆర్ చేస్తున్న చాలా యాడ్స్ కి కూడా అనిల్ వర్క్ చేశాడట. దీంతో, ఇప్పడు అనిల్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
