NTR Fans : ఎన్టీఆర్ పేరు చెడగొడుతున్న అభిమానులు.. వందకోట్ల స్కామ్..? రెండు వర్గాలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. పోలీస్ కంప్లైంట్ కూడా..

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. (NTR Fans)

  • Updated on- July 15, 2026 / 04:24 PM IST

NTR Fans

NTR Fans : మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు తమ హీరోల కోసం ఏమైనా చేస్తారు. హీరో అంటే దేవుడిలా చూస్తారు. కులం, మతం, ఏజ్ ఏదైనా సరే తమ హీరో విషయానికి వస్తే అభిమానులంతా ఒక్కటైపోతారు. వేరే హీరో అభిమానులతో ఫైట్ చేస్తారు, ఫ్యాన్ వార్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం గమనార్హం.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో వస్తారేమో కానీ ఇప్పట్లో ఆ ఆలోచన అయితే లేదని అందరికి తెలుసు. కానీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కనపడినప్పుడల్లా ఫ్యాన్స్ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. హీరో పేరు మీద అభిమాన సంఘాలు ఏర్పడటం, అవి సహాయ కార్యక్రమాలు చేయడం మాములే. అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే పేరుతో రా ఎన్టీఆర్ అనే ఓ సంస్థ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో తిరుపతిలో ఓ మీటింగ్ ఉంటుందని, ఎన్టీఆర్ వస్తారని, వంద కోట్లతో సహాయ కార్యక్రమాలు చేస్తామని, అందుకు విరాళాలు కూడా సేకరిస్తామని ఆ సంస్థ చెప్పినట్టు సోషల్ మీడియాలో పలు పోస్టులు వచ్చాయి.

Also Read : Pawan Kalyan : డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం.. చేతికట్టుతోనే ఇంటికి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ భార్య..

ఇది ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అవుతుందా అని మీడియా వాళ్ళు వార్తలు రాయడంతో రా ఎన్టీఆర్ సంస్థ ఇది పొలిటికల్ మీటింగ్ కాదు అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ తన టీమ్ తో, తన పీఆర్ తో ఓ లెటర్ రిలీజ్ చేయించారు. అసలు రా ఎన్టీఆర్ సంస్థ తమకు సంబంధం లేదని, వాళ్ళు చేసే పనులతో ఎన్టీఆర్ కి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరు కూడా వాడుకోవడానికి వీల్లేదు అంటూ లెటర్ రిలీజ్ చేసారు. సింపుల్ గా చెప్పాలంటే అసలు రా ఎన్టీఆర్ సంస్థ ఏంటి, ఎవరు అనేది కూడా ఎన్టీఆర్ కి తెలీదు అని క్లారిటీ ఇచ్చారు.

అటు రా ఎన్టీఆర్ సంస్థేమో అయన పేరుని వాడుకొని, డబ్బులు వసూలు చేసి, ఎన్టీఆర్ వస్తున్నాడని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్లపై విమర్శలు చేసారు. ఎన్టీఆర్ పేరు చెడగొట్టొద్దు, ఎన్టీఆర్ పేరు వాడుకొని మమ్మల్ని నమ్మించి మోసం చేసారు, వసూలు చేసిన డబ్బులు ఏవి? వంద కోట్ల స్కామ్ చేస్తున్నారా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. రా ఎన్టీఆర్ సంస్థ పై విమర్శలు భారీగా రావడంతో ఆ సంస్థకి సంబంధించిన ఓ వ్యక్తి.. మేము ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాతో చాలా మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అసలు రిలీజ్ చేసిన లెటర్ గురించి ఎన్టీఆర్‌ కి తెలిసి ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆపమంటే వెంటనే అన్ని కార్యక్రమాలు ఆపేస్తాము. ఆయన మాకు దేవుడు. అయన పేరుతో సేవ చేయడమే మా ఉద్దేశం అని అన్నారు. అయితే ఇది హాస్యాస్పదంగా ఉంది.

Also Read : Posani Krishna Murali : 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ దర్శకుడిగా మారిన పోసాని.. ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ..

స్వయంగా ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్ లెటర్ రిలీజ్ చేస్తే అసలు ఎన్టీఆర్ కి తెలియదు అని రా ఎన్టీఆర్ సంస్థ అనడంతో మరిన్ని సందేహాలు తలెత్తాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలి ఒకరు.. ఎన్టీఆర్ పేరు చెడగొట్టొద్దు, క్షమాపణలు చెప్పాలని రా ఎన్టీఆర్ సంస్థపై విమర్శలు చేస్తున్నారు. మరో వైపు రా ఎన్టీఆర్ సంస్థ, దానికి సంబంధించిన వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పుకుంటూ ఈ విమర్శలు చేసేవాళ్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా ఎన్టీఆర్ సంస్థపై తిరుపతిలో పోలీస్ కేసు కూడా పెట్టడం గమనార్హం. మొత్తానికి ఈ గొడవతో ఎన్టీఆర్ పేరు మాత్రం బ్యాడ్ గా మారుతుంది.