NTR Interesting Comments in Devara Promotional Interview with Sandeep Reddy Vanga
NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాపై భారీ హైప్ ఉంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ముంబైలో దేవర ప్రమోషన్స్ భారీగా చేసి వచ్చాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, దేవర టీమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడగా ఓ ఆసక్తికర విషయం కూడా తెలిపాడు.
Also See : Devara – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ ‘దేవర’ స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి..
సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ముంబైకి మొదటిసారి యాడ్ షూట్ కి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. అప్పటి వరకు బాలీవుడ్ గురించి చాలా విన్నాను. దాంతో ఇక్కడి టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ ఎలా ఉంటారో అని భయపడ్డాను. RRR ప్రమోషన్స్ సమయంలో ఆ భయం కొంచెం పోయింది. రాజమౌళి నాకు అప్పుడు చాలా గైడ్ చేసాడు. ఇప్పుడు దేవర ప్రమోషన్స్ కి ముంబై అంటే భయం మొత్తం పోయింది. తర్వాత అంతా ఒకటే, అందరూ సినిమా కిందే ఉన్నారు అని అర్ధమయింది అంటూ తెలిపారు.