NTR Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా కొత్త డేట్ అనౌన్స్.. ఏకంగా సంవత్సరం వాయిదా.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడంటే..

NTR Neel Release Date: తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (NTR Neel)

  • Updated on- April 21, 2026 / 12:00 PM IST

NTR Neel

NTR Neel : దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. KGF, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్స్ నుంచి రిలీజయిన ఫొటోలతో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ పెంచి పవర్ ఫుల్ గా తయారయ్యాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి ఈ సినిమాలో. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే వాయిదా పడింది. మొదట 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్నారు తర్వాత 2026 జూన్ 25న ఈ సినిమా (#NTRNeel) రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Also Read : ఎన్నికల వేల.. కోర్టుకు రాకుండా భార్యతో విజయ్ తెరవెనుక బేరాలా?

ఎన్టీఆర్ నీల్ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ఎన్టీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ ఫేస్ కనిపించకుండా షాడో కనిపిస్తూ పవర్ ఫుల్ గా ఉంది ఈ పోస్టర్. అయితే మరీ ఇంత ఆలస్యమా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఏకంగా సంవత్సరం వాయిదా వేయడంతో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు మే 20న రిలీజ్ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తారని సమాచారం.

Also Read : సినిమాల్లోకి రానా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిహికా బజాజ్..