Vijay : ఎన్నికల వేల.. కోర్టుకు రాకుండా భార్యతో విజయ్ తెరవెనుక బేరాలా?
ఓ పక్క ఎన్నికల హడావిడిలో విజయ్ బిజీగా ఉంటే ఈ విడాకుల అంశం తమిళనాట చర్చగా మారింది. (Vijay )
Vijay
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులు కావాలని, తన భర్త వేరే మహిళతో అక్రమ అంబంధం పెట్టుకున్నాడని విజయ్ భార్య సంగీత కొన్ని రోజుల క్రితం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల సమయంలో, విజయ్ పార్టీ పెట్టి మొదటిసారి పోటీ చేస్తున్న సమయంలో విజయ్ భార్య ఇలా విడాకులు కోరడం, విజయ్ పై ఆరోపణలు చేయడంతో ఈ వార్త సంచలనంగా మారింది.
ఓ పక్క ఎన్నికల హడావిడిలో విజయ్ బిజీగా ఉంటే ఈ విడాకుల అంశం తమిళనాట చర్చగా మారింది. అయితే ఏప్రిల్ 20 సోమవారం నాడు ఈ విడాకుల కేసుకు సంబంధించి విజయ్, సంగీత కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరూ హాజరు కాలేదు. ఎన్నికల సమయంలో వద్దని విజయ్ వాయిదా కోరినట్టు సమాచారం. విజయ్, సంగీత తరపున లాయర్లు ఇదే విషయాన్నీ కోర్టుకు చెప్పి కోర్టు బయటే చర్చలు జరుగుతున్నాయని, భరణం విషయం కూడా ఫైనల్ చేసుకుంటారని తెలిపి వాయిదా అడిగారు. దీంతో జూన్ 15 కి ఈ కేసుని కోర్టు వాయిదా వేసింది.
Also Read : Miheeka : సినిమాల్లోకి రానా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిహికా బజాజ్..
అయితే తమిళ మీడియా సమాచారం ప్రకారం సంగీత భరణం కింద 250 కోట్లు కోరిందని, విజయ్ 35 కోట్లు ఇస్తానని అన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కోర్టు బయటే చర్చించుకొని భరణం ఫైనల్ చేసుకొని కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని విజయ్ – సంగీత అనుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఎన్నికల వేల ఇలా విజయ్ తన భార్యతో విడాకుల విషయంలో భరణంపై బేరాలు ఆడటం వైరల్ గా మారింది.
