Miheeka : సినిమాల్లోకి రానా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిహికా బజాజ్..
రానా దగ్గుబాటి భార్యగా మిహికా బజాజ్ టాలీవుడ్ లో, ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. (Miheeka)
Miheeka
Miheeka : రానా దగ్గుబాటి భార్యగా మిహికా బజాజ్ టాలీవుడ్ లో, ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ సంపాదించింది. ఇంటీరియర్ డిజైనర్ గా, బిజినెస్ వుమెన్ గా, సేవా కార్యక్రమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటుంది మిహికా బజాజ్.
అయితే మిహికా బజాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ఓ ఓటీటీ షోలో పాల్గొనడం, బయట ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనపడటం, సినిమా సెలబ్రిటీలతో రెగ్యులర్ గా కలుస్తూ పోస్టులు చేయడంతో మిహికా కూడా సినిమాల్లోకి వస్తుందేమో అని రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ ఆర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మిహికా బజాజ్ మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందించింది.
Also Read : Raghu Kunche : చేపల కంపులో రాత్రంతా పడుకున్నా.. ఎందుకొచ్చానురా బాబు అనిపించింది..
మిహికా బజాజ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాను. నాకు సినిమాలపై, నటీనటులపై గౌరవం ఉంది. ఒకవేళ పనిచేసినా నేను కెమెరా వెనుకే పనిచేస్తాను. డిజైనింగ్ రంగంలో నా ట్యాలెంట్ చూపిస్తాను. కథలు చెప్పడం ఒక స్పెషల్ ట్యాలెంట్. అది తెలిసిన వాళ్ళే చేయాలి. నేను చేయను అని చెప్పింది. దీంతో మిహికా బజాజ్ తెరపై అయితే కనిపించదు అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ భవిష్యత్తులో తెరవెనుక మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ లేదా ప్రొడక్షన్ లోకి వచ్చే అవకాశాలు ఉందని తెలుస్తుంది.
