NTR – Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా.. సంక్రాంతి బరి నుంచి అవుట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అప్పుడే..

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్.

NTR Prasanth Neel New Movie Release Date Announced and First Glimpse Release Day Announced

NTR – Neel : దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుంది. KGF, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. అలాగే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించారు.

Also Read : Anil Ravipudi-Chiranjeevi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో విలన్ అత‌డేనా!

గతంలో ఈ సినిమాని 2026 జనవరి 9 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు. కానీ షూటింగ్ మొదలవ్వగానే సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేశారు. తాజాగా ఎన్టీఆర్ – నీల్ సినిమా 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ రోజు గురువారం, మొహరం పండుగ వచ్చింది. దీంతో వరుసగా వీకెండ్ కూడా కలిపి 4 రోజులు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్ – నీల్ సినిమా మంచి డేట్ పట్టుకుందని అంటున్నారు ఫ్యాన్స్. కానీ సంక్రాంతి బారి నుంచి తప్పుకుందని బాధపడుతున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తామని ప్రకటిచారు. అంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20 న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Rithu Chowdary : మా నాన్న చనిపోయినప్పుడు మేము ఏడుస్తుంటే డబ్బులు ఇవ్వాలి అని.. SRH నితీష్ రెడ్డి ఇంటర్వ్యూ చూసి..