NTR – Konda Surekha : సినీ పరిశ్రమపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చోము.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

NTR Reacts on Konda Surekha Comments on regarding Samantha

NTR – Konda Surekha : కొండా సురేఖ నిన్న కేటీఆర్ ని విమర్శిస్తూ నాగచైతన్య, సమంతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని ఫ్యామిలీతో పాటలు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

Also Read : Srikanth Odela : సమంత మా అక్కలాంటిది, ఇండస్ట్రీకి దొరికిన వరం.. సురేఖ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు.. దసరా డైరెక్టర్ వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. కొండా సురేఖ గారు.. వ్యక్తిగత జీవితాలను పాలిటిక్స్ లోకి లాగడం దిగజారుడుతనం. సెలబ్రిటీలు, ముఖ్యంగా మీలాంటి గౌరవ స్థానంలో ఉన్నవాళ్లు కొంచెం గౌరవం, హుందాతనం పాటించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన కరెక్ట్ కాదు అంటూ పోస్ట్ చేసారు. దీంతో ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. మరింతమంది ఫ్యాన్స్, సినీ ప్రముఖులు, నెటిజన్లు సమంత, నాగ చైతన్యలకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.