Srikanth Odela : సమంత మా అక్కలాంటిది, ఇండస్ట్రీకి దొరికిన వరం.. సురేఖ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు.. దసరా డైరెక్టర్ వ్యాఖ్యలు..
దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఈ ఇష్యూపై స్పందించాడు.

Dasara Director Srikanth odela Reacts on Konda Surekha Comments for Supporting to Samantha
Srikanth Odela – Konda Surekha : కొండా సురేఖ.. నాగచైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలని విమర్శిస్తూ సినీ పరిశ్రమ అంతా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కొండా సురేఖ కామెంట్స్ పై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఈ ఇష్యూపై స్పందించాడు. గతంలో శ్రీకాంత్ ఓదెల రంగస్థలం సినిమాకు పనిచేసాడు. దీంతో సమంతతో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసాడు.
శ్రీకాంత్ ఓదెల తన సోషల్ మీడియాలో.. ఇలాంటి కొన్ని అసహ్యకరమైన కామెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడటం దురదృష్టకరం. పవర్, పొజిషన్ గౌరవాన్ని తీసుకురావని ఇది చూస్తుంటే తెలుస్తుంది. రంగస్థలం సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. 365 రోజులు ప్రతిరోజు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. సమంత మేడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే సినీ పరిశ్రమలో పనిచేయాలి అనుకునే మహిళలకు చాలా అడ్డంకులు, భయాలు ఉన్నాయి. ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు ఆ భయాలను ఇంకా పెంచుతాయి. సినీ పరిశ్రమలోనే కాదు స్త్రీ, పురుష అసమానతలు అన్నిచోట్లా ఉన్నాయి. మహిళలు ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా, అవి తప్పు అని నిరూపించాలని, జీవితాల్లో ఎదగాలని, సినీ పరిశ్రమలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. సినిమా ఒక కళారూపం. మీరు గౌరవించకపోయినా పర్వాలేదు కాని సినిమాని, సినీ వ్యక్తులను అగౌరవపరచకండి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో శ్రీకాంత్ ఓదెల ట్వీట్ వైరల్ గా మారింది.
So bloody unfortunate to hear such disgusting comments especially from a person in a respectable position. This shows that power and position can't buy you dignity.
రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక అభిమాని గ…
— Srikanth Odela (@odela_srikanth) October 2, 2024