Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేమను పరిచయం చేసిన కృతిసనన్..
ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లను పరిచయం చేసే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు లవ్ ఇంటరెస్ట్ 'సారా' పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ పరిచయం చేసింది.
- gum 95921
- Updated on- August 28, 2023 / 05:23 PM IST
Nupur Sanon first look released from Raviteja Tiger Nageswara Rao by Kriti Sanon
Tiger Nageswara Rao : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుంటే రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ యూనిట్.. షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు.
Chiranjeevi : మలయాళ మూవీకి నో.. చిరంజీవి ఇకపై రీమేక్స్ చేయడట..!
ఈక్రమంలోనే ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లను పరిచయం చేసే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు లవ్ ఇంటరెస్ట్ ‘సారా’ పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ (Kriti Sanon) పరిచయం చేసింది. నుపూర్ సనన్, కృతి సనన్ సిస్టర్. సారా రోల్ లో.. నుపూర్ సనన్ కనిపించబోతుంది. ఫస్ట్ లుక్ లో నుపూర్ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికెళ్లి అభినందించిన బండారు దత్తాత్రేయ
ఇక రేణూ దేశాయ్ ఇటీవలే ఈ మూవీలోని తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది. చాలాకాలం తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న రేణూదేశాయ్ ఈ సినిమాలో ఒక బలమైన పాత్రలో నటిస్తుంది. 19’s కాలంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రవితేజ కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తమిళ్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
