×
Ad

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ అవుట్.. రీజన్ ఏంటి..?

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాలో ముంబై భామ నుపుర్ సనన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

  • Published On : September 20, 2023 / 07:02 PM IST

Nupur Sanon step down from Manchu Vishnu Kannappa project

Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ని గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ‘భక్త కన్నప్ప’ స్టోరీతో వస్తున్న ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు ‘ముఖేష్ కుమార్ సింగ్’ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముంబై భామ నుపుర్ సనన్ (Nupur Sanon) ని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇంతలో విష్ణు ఒక వార్త తెలియజేశాడు. ఈ సినిమా నుంచి నుపుర్ సనన్ తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.

Akhil Akkineni : ఇంకా ఏజెంట్ గెటప్‌లోనే అఖిల్.. కారణం ఏంటంటున్న నెటిజెన్స్..

ఈ విషయం గురించి మంచు విష్ణు ఒక ట్వీట్ చేశాడు. “ఈ వార్తను తెలియజేయడానికి బాధగా ఉంది. కన్నప్ప మూవీ నుంచి నుపుర్ సనన్ తప్పుకుంటుంది. డేట్స్ కుదరకపోవడంతో ఆమె తప్పుకుంటుంది. ఆమెను ఈ సినిమాలో మేము మిస్ అవ్వుతున్నాము. నుపుర్ తో ఫ్యూచర్ లో కలిసి టైం కోసం ఎదురు చూస్తుంటా. ఆమెకు నా బెస్ట్ విషెస్. ఇప్పుడు కన్నప్ప లోని హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాలి. అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Ram Charan : అప్పుడు నందమూరి.. ఇప్పుడు అక్కినేని అభిమానుల.. మనసు దోచుకుంటున్న రామ్ చరణ్..

మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఏ యాక్ట్రెస్ ఎంట్రీ ఇస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాని మోహన్ బాబు (Mohan Babu) 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్ మరియు తోట ప్రసాద్ ఈ మూవీకి స్టోరీ అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. న్యూజిలాండ్ లో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం జరుగుతుందని విష్ణు మూవీ ఓపెనింగ్ లో తెలియజేశాడు.