పర్మిషన్ లేకుండా ప్రచారానికి వాడేస్తారా.. అంటూ వీడియో యాప్‌పై నూస్రత్ జహాన్ సీరియస్

పర్మిషన్ లేకుండా ప్రచారానికి వాడేస్తారా.. అంటూ వీడియో యాప్‌పై నూస్రత్ జహాన్ సీరియస్

Updated On : September 22, 2020 / 8:21 PM IST

వెస్ట్ బెంగాల్ లోని బ‌సిర్‌హత్ లోక్‌స‌భ స్థానం నుంచి తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎన్నికైన నుస్ర‌త్ జ‌హాన్ అంటే అక్కడి సినీ అభిమానుల‌కు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమెకు కూడా రాజ‌కీయాల కంటే సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. ఓవైపు ఎంపీగా బిజీగా ఉంటూనే , మ‌రోవైపు సినిమాల్లో న‌టించాల‌ని ఉందంటూ మనసులో మాట‌ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఆమె అనుమతి లేకుండా ఓ వీడియో చాట్ యాప్ చేసిన పనికి.. ఆమె సీరియస్ అయ్యారు. ఈ విష‌య‌ంపై స‌ద‌రు ఎంపీ అనుమ‌తి లేకుండా త‌న ఫొటో ఉప‌యోగించారని పోలీస్ కంప్లైంట్ చేసింది. ఆ యాప్‌పై క‌ల‌క‌త్తా పోలీసుల‌ు మంగళవారం కేసు నమోదు చేసుకున్నారు.



ఆన్‌లైన్‌ ప్రమోషన్‌ కోసం త‌న అనుమతి లేకుండా తీసుకోకుండా ఫొటో వాడటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న విష‌యంలోనే కాదు, మ‌రే మ‌హిళ‌కు సంబంధించిన ఫొటోల‌ను అనుమ‌తి లేకుండా వాడ‌కుండా ఉండాలంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

వెంట‌నే ఆ యాప్‌పై చ‌ర్య‌లు తీసుకుని… స‌ద‌రు యాప్‌ ప్రకటనకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ పోలీసు కమిషనర్‌ అనూప్‌ శర్మను ట్యాగ్‌ చేశారు. న‌టి, ఎంపీ ఫిర్యాదుపై కమిషనర్ స్పందించి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.