Air Ambulance Crash: జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి..!
ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన చత్రా జిల్లా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైలట్లను వివేక్ వికాస్ భగత్, సావ్రాజ్దీప్ సింగ్‌గా గుర్తించారు.
Air Ambulance Crash Representative Image (Image Credit To Original Source)
- కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
- రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా దుర్ఘటన
- ఎయిర్ అంబులెన్స్ లోని ఏడుగురూ దుర్మణం..!
Air Ambulance Crash: జార్ఖండ్ లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చత్రా జిల్లాలో ఏడుగురు వ్యక్తులతో వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిందని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. అందులో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు సహాయకులు, ఒక డాక్టర్, ఒక పారామెడిక్ ఉన్నారు.
రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 విమానం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి రాత్రి 7గంటల 11 నిమిషాలకు బయలుదేరింది. 23 నిమిషాల తర్వాత అది రాడార్‌తో సంబంధాన్ని కోల్పోయింది.
“కోల్ కతాతో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత 19:34 IST సమయానికి వారణాసికి ఆగ్నేయంగా దాదాపు 100 NM దూరంలో విమానం కమ్యూనికేషన్ రాడార్ సంబంధాన్ని కోల్పోయింది” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది.
బీచ్‌క్రాఫ్ట్ C90 టెయిల్ నంబర్ VT-AJV. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది దర్యాఫ్తులో తెలుసుకుంటామని DGCA తెలిపింది. 41 ఏళ్ల వ్యక్తి అయిన రోగి ఒక ప్రమాదంలో 63 శాతం కాలిన గాయాలతో బాధపడ్డాడు. అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. అధునాతన వైద్యం కోసం అతడిని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.
”రాంచీ నుండి ఢిల్లీ వెళ్తున్న మెడికల్ చార్టర్డ్ విమానం జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలోని కసారియా ప్రాంతంలో కూలిపోయింది. రోగితో సహా ఏడుగురు ప్రయాణికులు మరణించారు” అని అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ BE9L విమానం రాష్ట్ర రాజధాని రాంచీ నుండి రాత్రి 7గంటల 11 నిమిషాలకు బయలుదేరింది. రోగితో పాటు, విమానంలో ఉన్న వ్యక్తులలో ఒక వైద్యుడు, ఒక పారామెడిక్, ఇద్దరు సహాయకులు, ఒక కమాండ్ పైలట్, ఒక కో-పైలట్ ఉన్నారు. ఈ ఎయిర్ అంబులెన్స్ ఢిల్లీలో రాత్రి 10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.
సోమవారం రాత్రి 7గంటల 34 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన చత్రా జిల్లా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నుండి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైలట్లను వివేక్ వికాస్ భగత్, సావ్రాజ్దీప్ సింగ్‌గా గుర్తించారు. తరలిస్తున్న రోగిని సంజయ్ కుమార్ (41) గా గుర్తించారు. పారామెడిక్ సచిన్ కుమార్ మిశ్రా, డాక్టర్ వికాష్ కుమార్ గుప్తా, సహాయకులు అర్చన దేవి , ధురు కుమార్ విమానంలో ఉన్న ఇతర వ్యక్తులు. ప్రమాదంలో ఏడుగురూ మరణించారు” అని అధికారులు తెలిపారు.
