మహర్షి లాస్ట్ సాంగ్ విన్నారా?

మహర్షి సినిమాలోని చివరి పాటని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Publish Date - May 15, 2019 / 11:41 AM IST

మహర్షి సినిమాలోని చివరి పాటని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోనూ  మంచి కలెక్షన్లు సాధిస్తుందీ సినిమా.

ఫ్రెండ్ షిప్, రైతుల సమస్యలు వంటి అంశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మహర్షి సినిమాలోని చివరి పాటని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇది మొదట ఆల్బమ్‌లో లేని పాట కావడం విశేషం.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్‌కి, శ్రీమణి అందమైన లిరిక్స్ రాయగా, కార్తీక్ చక్కటి ఫీల్‌తో పాడాడు. ‘నువ్వనీ ఇది నీదనీ ఇది నిజమనీ అనుకున్నావా’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. 

వాచ్ లిరికల్ సాంగ్..