×
Ad

Pawan Kalyan : OG మూవీ సెట్స్‌ నుంచి.. పవన్ కొత్త ఫోటో వచ్చేసింది.. నెట్టింట వైరల్

OG మూవీ సెట్స్‌ నుంచి పవన్ కొత్త ఫోటో వచ్చేసింది. దర్శకుడు సుజిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌గా..

  • Published On : February 16, 2024 / 08:41 AM IST

OG movie director Sujeeth change his insta profile pic with pawan kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘They Call Him OG’. ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకొని శరవేగంగా 75 శాతం చిత్రీకరణ పూర్తీ చేసుకున్న ఈ మూవీకి.. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ప్రస్తుతం బ్రేక్ లు పడ్డాయి. ఏపీలో ఎన్నికలు పూర్తి అయిన తరువాతే పవన్ మళ్ళీ ఓజి సెట్స్ లోకి అడుగుపెడతారు.

అయితే ఈ గ్యాప్ లో మూవీ టీం.. షూటింగ్ పూర్తి చేసుకున్నంత వరకు పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని సాగిస్తున్నారు. అలాగే ఆడియన్స్ ని ఖుషి చేస్తూ ఏదొక అప్డేట్ తో వస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. మూవీ నుంచి పవన్ సూపర్ డూపర్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ సెట్స్ లోని పవన్ కి సంబంధించిన ఓ ఫోటోని సుజిత్ షేర్ చేసారు.

Also read : Ooru Peru Bhairavakona Review : ‘ఊరి పేరు భైరవకోన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ని పవన్ కళ్యాణ్ ఫొటోతో సుజిత్ చేంజ్ చేసారు. ఆ ఫొటోలో పవన్, సుజిత్ బుజం పై చెయ్యి వేసి నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే బ్యాక్ షాట్ నుంచే మాత్రమే ఈ ఫోటో కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోని పవన్ అభిమానులు.. #TheyCallHimOG తో నెట్టింట తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆ పిక్ ని మీరు కూడా చూసేయండి.

ఇక OG విషయానికి వస్తే.. పవన్ నుంచి చాలా కాలం తరువాత ఓ గ్యాంగ్ స్టార్ మూవీ వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ నాడు విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు.