OG Movie Update : OG గ్లింప్స్.. తుఫాన్ వచ్చేస్తుంది.. పవర్ స్టార్ బర్త్‌డేకి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్..

పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి. పవన్ డేట్స్ ఇస్తే ఓ 20 రోజుల్లో పవన్ ఉన్న పార్ట్ మొత్తం ఫాస్ట్ గా పూర్తి చేసేయాలని సుజిత్ చూస్తున్నారు.

OG Movie Glimpse Releasing for Pawan Kalyan Birthday Fans Waiting

OG Movie Update :  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తున్నారు. ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే OG సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. పవన్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సుజిత్(Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో They Call him OG సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది.

Nagababu : రజినీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ అట్రాక్షన్..

పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే OG సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. పవన్ లేని సీన్స్ అన్ని షూటింగ్ అయిపోయాయి. పవన్ డేట్స్ ఇస్తే ఓ 20 రోజుల్లో పవన్ ఉన్న పార్ట్ మొత్తం ఫాస్ట్ గా పూర్తి చేసేయాలని సుజిత్ చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి ఓ టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది.

తాజగా చిత్రయూనిట్ అధికారికంగా ఈ ప్రకటన రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు తుఫాన్ వచ్చేస్తుంది అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హిడెన్ డీటెయిల్స్ తో ముంబైలో అర్ధరాత్రి జరిగే ఫైట్ సీక్వెన్స్ గ్లింప్స్ లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తన అనుచరులతో గన్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు OG నుంచి రాబోయే గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. OG చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ తో సినిమాపై మరింత హైప్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు