OG Premiere
OG Premiere : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుంది. నేడు రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని అయిపోయాయి. భారీ హైప్ తో OG సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ హైప్ కేవలం ఫ్యాన్స్ లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లో, టాలీవుడ్ జనాల్లో కూడా ఉంది.(OG Premiere)
చాలా మంది దర్శక నిర్మాతలు, హీరో, హీరోయిన్స్, నటీనటులు, సింగర్స్, టాలీవుడ్ జనాలు అంతా కూడా OG సినిమా ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది OG గురించి ట్వీట్స్, స్పీచ్ లు, రీల్స్ చేస్తున్నారు. OG సినిమాకు ఉన్న హైప్ తో టాలీవుడ్ జనాలకు స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారట. హైదరాబాద్ విమల్ థియేటర్ లో మైత్రి నిర్మాతలు స్పెషల్ షో ప్లాన్ చేశారట.
Also Read : They Call Him OG : రజినీకాంత్ కూలీకి అయినట్టే.. పవన్ కళ్యాణ్ OG కి ఎఫెక్ట్ అవుతుందా?
ఇవాళ రాత్రి 10 గంటలకు ఈ షో పడనుంది. ఈ షోకి టాలీవుడ్ నుంచి భారీగా సెలబ్రిటీలు హాజరు కానున్నారు. రాజమౌళి, అకిరా నందన్ కూడా ఇక్కడే OG సినిమా చూడబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా వాయిదా పడటంతో ప్రశాంత్ నీల్ కూడా OG సినిమా చూడటానికి హాజరవుతున్నట్టు టాక్. వీళ్ళే కాకుండా చాలా మంది సింగర్స్, హరీష్ శంకర్, మారుతి, SKN, కిరణ్ అబ్బవరం, OG మూవీ టీమ్, పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా నేడు రాత్రి విమల్ థియేటర్ లో OG సినిమా చూడబోతున్నట్టు తెలుస్తుంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ రేంజే వేరు, మాములు జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా హంగామా ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్.
Also See : Vasanthi Krishnan : OG మానియాలో బిగ్ బాస్ వాసంతి.. భర్తతో కలిసి స్పెషల్ OG డ్రెస్ లో పోజులు..