Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్‌.. ఫోటో వైరల్!

పవన్ అభిమాని బిర్యానీ పార్సిల్‌ పంపించి సర్‌ప్రైజ్ చేసిన OG నిర్మాత డివివి. అసలు విషయం ఏంటో తెలుసా?

OG producer dvv danayya sent biryani parcel to pawan kalyan fan

Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ They Call Him OG. RRR నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాహూ ఫేమ్ సుజిత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పవన్ నుంచి ఇటువంటి సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ముంబైలో ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

Ustaad Bhagat Singh : పవన్‌తో శ్రీలీల మాస్ డాన్స్ నెంబర్.. ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సాంగ్ రిపీట్ చేస్తారా?

కాగా నిన్న రంజాన్ వేడుక కావడంతో నిర్మాత డివివి ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ పోస్ట్ కి రెస్పాండ్ అవుతూ ఒక పవన్ అభిమాని.. “OG నుండి బిర్యాని ప్లాన్ చెయ్” అంటూ కామెంట్ చేశాడు. దీనికి డివివి బదులిస్తూ.. ‘ఒకే అడ్రస్ మెసేజ్ చెయ్యి’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో అభిమాని అడ్రెస్స్ పంపించగా కొద్దిసేపటిలోనే తన రూమ్ కి బిర్యానీ పార్సిల్‌ చేరుకుంది. బిర్యానీ పార్సిల్‌ చూసి సర్‌ప్రైజ్ ఫీల్ అయిన అభిమాని దానిని ఫోటో తీసి పోస్ట్ చేసి థాంక్యూ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక పవన్ నటిస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. వినోదయ సిత్తం రీమేక్ (PKSDT) షూటింగ్ పూర్తి చేయగా, ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. OG తో పాటు ఆ చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు. ఈ రెండు షూటింగ్స్ పూర్తి చేసి హరి హర వీరమల్లు సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఆ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ సినిమాతో పవన్ మొదటిసారి వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు.