Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన OG సింగర్ రాజకుమారి.. లేడీ డైరెక్టర్ సినిమాకు..

'ఇంప్యూర్' సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. (Raja Kumari)

  • Published on- September 28, 2026 / 06:10 PM IST

Raja Kumari

Raja Kumari : వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల సంయుక్త నిర్మాణంలో నిశాంతి ఇవని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా ‘ఇంప్యూర్’. ఈ సినిమాకు వారాహి కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. యష్న, సాయి కృష్ణ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ‘ఇంప్యూర్’ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగ్గా డైరెక్టర్ నందినీ రెడ్డి హాజరయ్యారు.

ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ఓఎంజీ సాంగ్ ని తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి పాడటంతో పాటు సంగీత దర్శకత్వం వహించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో ‘ఫైర్ స్ట్రోమ్’ పాడింది ఈ సింగరే. షారుఖ్ ఖాన్ జవాన్ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లోని ధోప్ సాంగ్ కూడా ఈమె పాడారు. ఓజీ సాంగ్ తర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట ఇంప్యూర్ లో ‘ఓఎంజీ’ సాంగ్. ఈ పాటకు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. అలాగే ఈ సినిమాకు రాజ కుమారి సంగీతం అందించడమే కాక రెండు పాటలు పాడి సినిమాలో అతిథి పాత్రలో కూడా నటించారని సమాచారం.

Also Read : Nani : ఫేక్ కలెక్షన్స్ కాదు.. నాని కౌంటర్ ఇచ్చాడా? డిస్ట్రిబ్యూటర్ లెక్కల షీట్లు తీసుకొచ్చి..

ఇంప్యూర్ సినిమా గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మీడియాతో మాట్లాడుతూ… కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన సినిమా ఇది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్ – అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెప్పే సినిమా అని తెలిపారు.