OG Song
OG Song : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ హైప్ ఉన్న సంగీతి తెలిసిందే. సెప్టెంబర్ 25 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలని పెంచారు. తాజాగా OG సినిమా నుంచి గన్స్ & రోజెస్ అనే అదిరిపోయే పాటని రిలీజ్ చేశారు.(OG Song)
ఈ పాటని అద్వితీయ వొజ్జల రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో సింగర్స్ హర్ష, శృతి రంజని, అద్వితీయ, ప్రణతి, శృతిక, ప్రత్యూష, గిరిజ, సౌజన్య లు పాడారు. ఈ సాంగ్ ని జపనీస్, ఇంగ్లీష్, తెలుగు పదాలతో కలిపి రాశారు. మీరు కూడా OG గన్స్ & రోజెస్ పాట వినేయండి..