OG Success Meet
OG Success Meet : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతుంది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో ఫ్యామిలీలు కూడా OG సినిమాకు వెళ్తున్నారు. ఈ సినిమా విజయంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు నుంచి ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ స్టిల్స్, సినిమాలో పవన్ లుక్స్, సాంగ్స్.. ఇవన్నీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.(OG Success Meet)
చాన్నాళ్ల తర్వాత పవన్ భారీ సక్సెస్ కొట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా చాలా మంది సినిమా చూసి పొగిడారు. ఇప్పటికే OG 270 కోట్లకు పైగా వసూలు చేసి 300 కోట్లకు దూసుకెళ్తుంది. తాజాగా మెగాస్టార్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా OG సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ప్లాన్ చేసింది.
Also Read : Pawan Kalyan : మెగా షో తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్.. OG యూనివర్స్ ఉంది.. వీడియో వైరల్..
పవన్ కళ్యాణ్ కూడా ఎలాగో హైదరాబాద్ లోనే ఉండటంతో రేపు అక్టోబర్ 1న సక్సెస్ మీట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో రేపు అక్టోబర్ 1 బుధవారం రాత్రి OG సక్సెస్ మీట్ చేయనున్నట్టు సమాచారం. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ టీమ్ అంతా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. దీంతో అక్టోబర్ 2 దసరా కాగా పవన్ ఫ్యాన్స్ కి ఒక రోజు ముందే పండగ వచ్చేసినట్టే అని అంటున్నారు.