×
Ad

OG Ticket Prices : దిల్ రాజుకు షాక్.. OG టికెట్‌ ధరల పెంపు సస్పెండ్ చేసిన హైకోర్టు..

తాజాగా OG టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. (OG Ticket Prices)

OG Ticket Prices

OG Ticket Prices : భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ రెండు తెలుగు ప్రభుత్వాలు అనుమతులిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ OG సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుతూ రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణలో బెనిఫిట్ షో 800 రూపాయలకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు.(OG Ticket Prices)

అయితే తాజాగా OG టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. OG సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహేష్ యాదవ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ని విచారించి హైకోర్టు ఆ జీవోని సస్పెండ్ చేసిందని సమాచారం. కేసు తర్వాత విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు.

Also Read : OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..

నైజాంలో ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో దిల్ రాజుకి భారీ షాక్ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తో టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒకవేళ టికెట్ రేట్లు తగ్గితే ఇంకా మంచిదే, దసరా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీలు అంతా వస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ టికెట్ రేట్ల పెంపుపై నిర్మాణ సంస్థ స్పందిస్తుందా చూడాలి.