OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..

ఇప్పటివరకు నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ తో అత్యధిక కలెక్షన్స్ చేసిన తెలుగు సినిమాలు ఇవే.. (OG Record)

OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..

OG Record

Updated On : September 24, 2025 / 3:32 PM IST

OG Record : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతుంది. ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో కూడా భారీగా టికెట్స్ సేల్స్ అవుతున్నాయి. ప్రీమియర్స్ తోనే అమెరికాలో OG కలెక్షన్స్ అదరగొడుతుంది.(OG Record)

OG సినిమాకు చాలా ముందే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసారు. తాజాగా అమెరికాలో OG సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థ ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 2.6 మిలియన్ డాలర్స్ వసూలు చేసిందని ప్రకటించింది. అంటే దాదాపు 21 కోట్లకు పైగా గ్రాస్ ఆల్రెడీ అమెరికా నుంచే వచ్చేసింది. ఇవన్నీ కేవలం ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ తో వచ్చినవే.

Also See : OG Movie Stills : పవన్ కళ్యాణ్ OG సినిమా HD పోస్టర్స్ మీ కోసం..

అయితే గతంలో స్టార్ హీరోల సినిమాల కంటే OG తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నారని, అలాగే కంటెంట్ చివరి నిమిషం వరకు రాకపోవడంతో ఈ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి కానీ లేకపోతే ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ దాటేసేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పటివరకు నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ తో అత్యధిక కలెక్షన్స్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..

కల్కి 2898AD సినిమా – 3.05 మిలియన్ డాలర్స్
RRR – 2.9 మిలియన్ డాలర్స్
OG – 2.6 మిలియన్ డాలర్స్
దేవర – 2.51 మిలియన్ డాలర్స్
పుష్ప 2 – 2.5 మిలియన్ డాలర్స్ రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ తో వసూలు చేసాయి.

Also Read : OG Record : విజయవాడలో పవర్ స్టార్ ఆల్ టైం రికార్డ్.. కేవలం ప్రీమియర్స్ తోనే..

అయితే ఇవన్నీ చాలా థియేటర్స్ లో రిలీజ్ చేసారని, OG కూడా ఇంకా ఎక్కువ థియేటర్స్ లో, ఎక్కువ ప్లేసెస్ లో రిలీజ్ చేస్తే ఈజీగా కల్కి రికార్డ్ బద్దలయ్యేదని అంటున్నారు. మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి OG సినిమా.