OG Record : విజయవాడలో పవర్ స్టార్ ఆల్ టైం రికార్డ్.. కేవలం ప్రీమియర్స్ తోనే..

రిలీజ్ కి ముందే పవర్ స్టార్ OG సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది.(OG Record)

OG Record : విజయవాడలో పవర్ స్టార్ ఆల్ టైం రికార్డ్.. కేవలం ప్రీమియర్స్ తోనే..

OG Record

Updated On : September 24, 2025 / 2:14 PM IST

OG Record : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా హైప్ కి దెబ్బకు రికార్డులు అన్ని ఎగిరిపోతున్నాయి. అమలాపురం నుంచి అమెరికా దాకా ఆన్లైన్ బుకింగ్స్ అన్ని అప్పుడే అయిపోయాయి. ప్రీమియర్స్ షోలకు మరింత డిమాండ్ ఉంది. టికెట్ రేట్లు పెంచినా ఫ్యాన్స్, సినిమా లవర్స్ OG టికెట్లు ఎగబడి కొంటున్నారు. దీంతో రిలీజ్ కి ముందే OG సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది.(OG Record)

తాజాగా పవన్ కళ్యాణ్ OG సినిమా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. కేవలం ప్రీమియర్ షోలతోనే ఏకంగా ఒక కోటి 24 లక్షల గ్రాస్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. ఇది కేవలం ఒక్క విజయవాడ సిటీలో మాత్రమే. ఇప్పటివరకు ఏ సినిమాకు ప్రీమియర్స్ కి ఇంత రేంజ్ లో కలెక్షన్స్ రాలేదని విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. కేవలం ముందు రోజు ప్రీమియర్స్, ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్ కలిపి ఒక్క విజయవాడ సిటీలోనే ఒక కోటి 24 లక్షల గ్రాస్ వసూలుచేసింది OG సినిమా.

Also Read : OG Premiere : OG ప్రీమియర్స్.. ఇవాళ రాత్రికి సగం టాలీవుడ్ అక్కడే.. రాజమౌళి, ప్రశాంత్ నీల్, అకిరా..

సినిమాకు ఉన్న డిమాండ్ తో షోలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో కలెక్షన్స్ కూడా పెరగనున్నాయి. ఇలా ఒక్క విజయవాడలోనే కాదు చాలా చోట్ల OG సినిమా ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తుంది. ఇది కదా అసలైన పవర్ స్టార్ స్టామినా అంటే అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.