Aadarsha Kutumbam : వెంకీ ‘ఆద‌ర్శ కుటుంబం’ వాయిదా..

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న ఆద‌ర్శ కుటుంబం (Aadarsha Kutumbam) విడుద‌ల మ‌రోసారి వాయిదా ప‌డింది.

Once again Victory Venkatesh Aadarsha Kutumbam Release postponed

Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేష్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌. ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం-హౌస్ నెంబర్ 47 ’ విడుద‌ల మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ తెలియ‌జేశారు. వాస్త‌వానికి ఈ చిత్రం అక్టోబ‌ర్ 9న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా పూర్తి కాక‌పోవ‌డం వ‌ల్ల ఈ చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లోనే కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డిస్తామ‌ని చెప్పుకొచ్చారు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు త‌గిన స‌మయం లేద‌ని, ఇలాగే విడుద‌ల చేస్తే తాము కూడా నేరుగా శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. ఇక తాము అక్టోబ‌ర్ 9న రావ‌డం లేద‌ని ముందే చెప్పి ఉంటే వేరే సినిమాలైనా వ‌చ్చి ఉండేవ‌ని, అందుకు క్ష‌మించాల‌న్నారు. సినిమా విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందు వాయిదా వేయ‌డం స‌బ‌బు కాద‌నే విష‌యం తెలుస‌న్నారు. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ క‌ట్ చేసే స‌మ‌యం కూడా లేద‌న్నారు. ఇంకో రెండు పాటలు, ట్రైల‌ర్ విడుద‌ల చేయాల్సి ఉంద‌ని, రిలీజ్ వాయిదా వేయ‌డంతో స‌మయం దొరుకుతుంద‌ని, కాబ‌ట్టి అన్నీ చ‌క్క‌గా విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు.

Doctor Babu : డాక్ట‌ర్ బాబు పెళ్లి రోజు సెల‌బ్రేష‌న్స్.. ఫోటోల‌ను షేర్ చేసిన మంజుల‌..

కొత్త విడుద‌ల తేదీపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నార‌ని, ఆయ‌న రాగానే మాట్లాడి విడుద‌ల తేదీపై ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఇక ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే చాలా భ‌యంగా ఉంద‌న్నారు. అలాంటి వాటికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే కాస్త ఆల‌స్య‌మైనా క్వాలిటీ ప్రొడ‌క్ట్ ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే సినిమాను వాయిదా వేసిన‌ట్లుగా చెప్పారు.

ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌. నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ‌, రావు ర‌మేష్‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.