Robert De Niro : 79ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడంపై.. ఆస్కార్ నటుడు రియాక్షన్..
79ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడంపై ఆస్కార్ నటుడు రాబర్ట్ డి నీరో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
- gum 95921
- Published On : January 28, 2024 / 03:43 PM IST
Oscar Nominated actor Robert De Niro comments about his new born girl at age 80
Robert De Niro : హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో గత ఏడాది 79 ఏళ్ళ వయసులో తండ్రి అయ్యారు. ఈ నటుడు రెండుసార్లు ఆస్కార్ ని గెలుచుకున్నారు. ఒకసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మరోసారి బెస్ట్ యాక్టర్‌గా అకాడమీ అవార్డులను అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు గాను తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో రాబర్ట్ నిలిచారు.
ఇలా ఒక పక్క ప్రొఫెషనల్ కెరీర్ లో వరుస అవార్డులు అందుకుంటూ.. మరో పక్క పర్సనల్ కెరీర్ లో వరుసగా తండ్రి అవుతూ వస్తున్నారు. ఇప్పటికే రాబర్ట్ కి ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో రాబర్ట్ మరోసారి తండ్రి అయ్యారు. తన గర్ల్ ఫ్రెండ్ ‘టిఫనీ చెన్’తో పండంటి ఆడపిల్లకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఆ పాపకి ‘గియా’ అనే పేరు పెట్టారు.
Also read : Simran Natekar : వార్నీ ఆ సిగరెట్ యాడ్ గర్ల్ ? ఎంత అందంగా మారిపోయింది
ఇక ఈ ఏడాది ఆస్కార్ కి ఎంపిక అవ్వడంతో రాబర్ట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన తన పాప గియా గురించి మాట్లాడుతూ.. “నాకు ఎన్ని టెన్షన్స్ ఎదురవుతున్నా, తనని ఒక్కసారి చూస్తే అన్ని మర్చిపోతాను. తను అంత ముద్దుగా చూస్తుంటుంది. తను ప్రతిదీ గమనిస్తుంటుంది. అది చాలా అందంగా ఉంటుంది. నేను 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే. నేను ఉన్నంత కాలం తనతోనే ఉండలని అనుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.
కాగా గత ఏడాది మరో హాలీవుడ్ నటుడు ‘అల్ పాసినో’ కూడా 83 సంవత్సరాల వయసులో తండ్రి అయిన సంగతి తెలిసిందే. అల్ పాసినో నాలుగోసారి తండ్రి అయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే, అల్ పాసినో అండ్ రాబర్ట్ డి నీరో ఇద్దరు కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో కలిసి నటించారు. దీంతో కొంతమంది నెటిజెన్స్.. నటనలోనే కాదు తండ్రి అవ్వడం విషయంలో కూడా పోటీ పడుతున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
