Oscars 2024 Full List : 96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. దుమ్ము దులిపేసిన ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్..

96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్..

Oscars 2024 The Academy 96th Oscar Awards Full List Oppenheimer Poor Things Movie gets More Awards

Oscars 2024 Full List : నేడు 96వ ఆస్కార్ వేడుకలు ఘనంగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అంతా ఈ అవార్డ్స్ కోసం ఎదురు చూసారు. నామినేషన్స్ లో ఓపెన్ హైమర్, పూర్ థింగ్స్, బార్బీ సినిమాలు ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మన భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం 4 గంటల అనునది ఆస్కార్ వేడుకలు జరిగాయి.

96వ ఆస్కార్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్..

బెస్ట్ పిక్చర్ – ఓపెన్ హైమర్
బెస్ట్ యాక్టర్ – కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
బెస్ట్ యాక్ట్రెస్ – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ – రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్ యాక్ర్ట్రెస్ సపోర్టింగ్ రోల్ – డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
బెస్ట్ సినిమాటోగ్రఫీ – హొయితే వాన్ హోతేమ(ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
బెస్ట్ డైరెక్టర్ – క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ – 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం – ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్‌ – జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (యూకే)
బెస్ట్‌ మేకప్ అండ్ హెయిర్‌ స్టయిల్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ – లుద్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్‌ – వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ ( బార్బీ)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – వార్ ఈజ్ ఓవర్! ఇన్స్పైర్డ్ బై ది మ్యూజిక్ అఫ్ జాన్ & యోకో
బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ – ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌
బెస్ట్ సౌండ్‌ – ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌
బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌- గాడ్జిల్లా మైనస్‌ వన్‌
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే – కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)

Also Read : Robert Downey : 30 ఏళ్లుగా ట్రై చేస్తుంటే.. హమ్మయ్య ఎట్టకేలకు ఐరన్ మ్యాన్‌కు ఆస్కార్ వచ్చింది.. కానీ..

96వ అకాడమీ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమా ఏకంగా 7 అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత పూర్ థింగ్స్ 4 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.

ట్రెండింగ్ వార్తలు