OTT – Theater Releases : ఈరోజు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
ఈ వీక్ చిన్న సినిమాలు అన్ని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒక్కరోజే బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
- gum 95921
- Published On : October 6, 2023 / 10:53 AM IST
OTT and Theater Releases in Tollywood on october 6 2024
OTT – Theater Releases : గత వారం పెద్ద సినిమాలు రిలీజ్‌లు ఉండడం, వచ్చే వారం కూడా దసరా బరిలో నిలిచేందుకు పెద్ద సినిమాలు వస్తుండడంతో.. ఈ వీక్ చిన్న సినిమాలు అన్ని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒక్కరోజే బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలిసి నటించిన ‘మంత్ అఫ్ మధు’.. లవ్ అండ్ ఎమోషన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన ‘మామా మశ్చీంద్ర’.. యాక్షన్ థ్రిల్లర్ తో అలరించబోతుంది. కిరణ్ అబ్బవరం, నేహశెట్టి.. ‘రూల్స్ రంజన్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ తో తెరకెక్కిన యూత్ ఫుల్ కాలేజీ ఎంటర్టైనర్ చిత్రం ‘మ్యాడ్’.
థియేటర్ లో కడుపుమ్బా నవ్వించడానికి నేడు వచ్చేస్తున్నారు. అలాగే సిద్దార్థ్ నటించిన ‘చిన్న’.. ఒక థ్రిల్లర్ కథతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘800’ కూడా ఇవాళే రిలీజ్ కాబోతుంది. ‘ఏందిరా ఈ పంచాయతీ’ అనే ఒక చిన్న సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అలాగే హాలీవుడ్ హారర్ మూవీ ‘The Exorcist Believer’ కూడా నేడు రిలీజ్ కానుంది.
ఇక ఓటీటీ విషయానికి వస్తే..
మిస్టర్ ప్రెగ్నెంట్ – ఆహా
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ – ఆహా
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి – నెట్‌ఫ్లిక్స్
OMG2 – నెట్‌ఫ్లిక్స్ (అక్టోబర్ 8 నుంచి)
Gadar2 – ZEE5
ముంబై డైరీస్ S2 – ప్రైమ్ వీడియో (సిరీస్)
లోకి S2 E1 – హాట్ స్టార్ (సిరీస్)
