OU JAC Students Attacked on Allu Ajun House Serious Situation at Bunny Home
Allu Arjun : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి మరింత తీవ్రమవుతుంది. తాజాగా OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అల్లు అర్జున్ వల్లే రేవంతి చనిపోయింది అంటూ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేశారు.
పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసారు. అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. పలువురు గోడలు ఎక్కి లోపలికి దిగి బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు. బౌన్సర్లు అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న మొక్కల కుండీలు పగలకొట్టారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడి జరగడంతో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. పలువురు JAC నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.