Jagapathi Babu : నేను వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించా.. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదు అన్నందుకు ఇప్పుడు చెప్తున్నాను..
నేడు జగపతి బాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు.

Jagapathi Babu Released a Video Reacts to CM Revanth Reddy Comments
Jagapathi Babu : అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి మరింత చర్చగా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ కి ఏమైందని అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు, అందులో ఒక్కరైనా ఆ కుటుంబాన్ని, ఆ బాలుడిని పరామర్శించారా అంటూ ఫైర్ అయ్యారు.
Also Read : Allu Arjun : ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ విజ్ఞప్తి.. ఫ్యాన్స్ ముసుగులో అలా చేస్తే చర్యలు తీసుకోబడతాయి..
దీనికి సమాధానంగా నేడు జగపతి బాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. నేను షూటింగ్ నుండి ఊరి నుంచి రాగానే హాస్పిటల్ కి వెళ్ళాను. ఈ ఇన్సిడెంట్ లో బాధపడ్డ ఆ కుటుంబాన్ని, శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించాను. మానవత్వంతో వెళ్ళాను. ఆ బాబు ఆరోగ్యం కుదుటపడుతుంది అని వాళ్లకు భరోసా ఇచ్చి వచ్చాను. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పాను. నేను వెళ్లినట్టు పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024