Payal Rajput : ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థపై ఫైర్ అయిన పాయల్ రాజ్‌పుత్.. కొద్ది సేపటికే..

ఇటీవల ఓ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించిన పాయల్ రాజ్‌పుత్ దిగిన తర్వాత తన లగేజ్ తీసుకోగా ఆ లగేజ్ డ్యామేజ్ అయిఉండటం చూసి ఆ సంస్థపై ఫైర్ అయింది. ఈ మేరకు ట్విట్టర్లో................

Paayal Rajput fires on Indigo Airlines

Payal Rajput :  RX 100 సినిమాతో తెలుగులో బాగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. త్వరలో విష్ణు మంచుతో కలిసి జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా పాయల్ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై ఫైర్ అవుతూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

ఇటీవల ఓ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించిన పాయల్ రాజ్‌పుత్ దిగిన తర్వాత తన లగేజ్ తీసుకోగా ఆ లగేజ్ డ్యామేజ్ అయిఉండటం చూసి ఆ సంస్థపై ఫైర్ అయింది. ఈ మేరకు ట్విట్టర్లో.. ‘డ్యామేజ్‌ అయిన నా లగేజ్ చూడండి. ఇండిగో విమాన సిబ్బంది లగేజ్ ని దారుణంగా విసిరారు. వారి నిర్లక్ష్యం కారణంగానే నా లగేజ్‌ పాడైంది. ఇది ఒక చేదు అనుభవం” అంటూ ఫోటోలని పోస్ట్ చేసి ఇండిగో సంస్థని ట్యాగ్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు.

Tollywood : కార్మికుల వేతనాలు పెంచుతూ.. ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి నిర్ణయం..

ఆ తర్వాత కొద్ది సేపటికి పాయల్ రాజ్‌పుత్ మరో ట్వీట్ చేస్తూ.. ”ఇండిగో సంస్థ నా సమస్యని పరిష్కరించింది. త్వరగా రెస్పాండ్ అయింది. ఇందుకు ఆ సంస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పోస్ట్ చేసి ఇండిగో సంస్థని ట్యాగ్ చేసింది.