Salaar : అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సలార్.. అదేంటో తెలుసా..?
ప్రభాస్ సలార్ యూట్యూబ్ వ్యూస్‌తో, ప్రీ రిలీజ్ బిజినెస్‌తో.. ఇలా ప్రతి విషయంలో రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఈ మూవీ అమెరికాలో ఒక సరికొత్త రికార్డుని నెలకొలిపింది.
- gum 95921
- Published on- July 17, 2023 / 08:01 PM IST
Pabhas Salaar Ceasefire is released in america in record centers
Pabhas Salaar : రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఆ టీజర్ తో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో పలుకుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 200 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం.
ఇలా ప్రతి విషయంలో ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఈ మూవీ అమెరికాలో ఒక సరికొత్త రికార్డుని నెలకొలిపింది. ఇప్పటి వరకు అమెరికాలో ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానని సెంటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. నార్త్ అమెరికా మొత్తం మీద సుమారు 1979 లొకేషన్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అమెరికాలో ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ కావడం ఆల్ టైం రికార్డు అంటున్నారు. ఒక్క టీజర్ తోనే ఈ మూవీ పై ఇంతటి క్రేజ్ వస్తే.. ఆగష్టులో ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. అది చూశాక ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధంకావడం లేదు.
Vishnu Vishal : కమెడియన్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వలేనా..?
కాగా ఈ సినిమాలో శ్రుతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
